డైలీ భారత్, వైరా, ఖమ్మం జిల్లా: గణేష్ నవరాత్రుల సందర్భంగా జూలూరుపాడు మండలం మచినేనిపేటతండా గ్రామంలో యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయకుడి మండపాన్ని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బానోత్ ఈరు, బానోత్ చిన్న, జర్పుల రమేష్, బానోత్ రవి, గణేష్, గోపాల్, రాందాస్ మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.