| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కబడ్డీ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సిహెచ్ రాజు

కబడ్డీ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సిహెచ్ రాజు

కబడ్డీ జిల్లా ఆసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రాజు.. 

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా తాడువాయి మండల కేంద్రానికి చెందిన సిహెచ్ రాజు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ... జిల్లాలో కబడ్డీ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికలలో అధ్యక్షుడిగా భాస్కర్ రెడ్డి,ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నగేష్, సహాయ కార్యదర్శిగా జగదీశ్వర్, ఉపాధ్యక్షులుగా మధుసూదన్ రెడ్డి,ఈసి మెంబర్లు గా లక్ష్మణ్, నాగరాజు, శ్రీనివాస్ లు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.

Previous రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : మార్కెట్ చైర్ పర్సన్ తలారి రాణి
Next వేములవాడ ఎంపీడీవో కార్యాలయంలో చోరీ కలకలం... ఫ్యాన్, వైర్లు ఎత్తుకెళ్లిన దుండగులు
ADVERTISEMENT