డైలీ భారత్, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రూ.28 లక్షల 50 వేల విలువైన అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తలారి రాణి నర్సింలు పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ తలారి రాణి నర్సింలు మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రెండేళ్ల పదవీకాలంలో రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండి సేవలందించామన్నారు. రైతుల సహకారంతో మార్కెట్ కమిటీ అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచి కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ కొండెం రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు గజ్జల రాజు, పోతుగల్ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్, ఆత్మ డైరెక్టర్ కొండల్ రెడ్డి, డైరెక్టర్లు అన్నమనేని సుధాకర్ రావు, క్యారం రాజు, మామిళ్ళ శ్రీకాంత్, ప్రతాప్ రెడ్డి, రాగం కొమురయ్య, నల్ల బుచ్చయ్య, లకావత్ మున్న, కుంభాల యాదగిరి రెడ్డి, కదిరే సత్యం గౌడ్, మారుపాక శంకర్, మోతే బాలరాజు, పోచమ్మల అనిత తదితరులు పాల్గొన్నారు.