| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సృష్టిస్తున్న దివ్యాంగ విద్యార్థులు

ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సృష్టిస్తున్న దివ్యాంగ విద్యార్థులు

ఎల్లారెడ్డిపేటలో CWSN క్రీడా, సాంస్కృతిక పోటీలు ఘనంగా నిర్వహణ

డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట:  దివ్యాంగులలోని ప్రతిభ వెలకట్టలేనిదని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి కృష్ణహరి అన్నారు.

గురువారం స్థానిక భవిత కేంద్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మండల స్థాయి CWSN ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థులకు క్రీడా మరియు సాంస్కృతిక పోటీలు ఘనంగా నిర్వహించారు.

విద్యార్థుల వైకల్యం, శారీరక సామర్థ్యాల ఆధారంగా రన్నింగ్, స్పూన్ రేస్, మ్యూజికల్ చైర్స్ వంటి క్రీడలతో పాటు పాటలు, నృత్యం, చిత్రలేఖనం విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఇక్కడ ఎంపికైన ప్రతిభావంతులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ప్రశాంత్ SGT, IERP కల్యాణి, MIS CCO రోషిణి లావణ్య, భవిత సెంటర్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Previous చేవెళ్ల ట్రెజరీ కార్యాలయంలో ఎసిబి దాడులు
Next రక్తదాతలే ప్రాణదాతలు: కామారెడ్డిలో 96 మంది రక్తదానం : DSP, CI ప్రశంసలు
ADVERTISEMENT