| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చేవెళ్ల ట్రెజరీ కార్యాలయంలో ఎసిబి దాడులు

చేవెళ్ల ట్రెజరీ కార్యాలయంలో ఎసిబి దాడులు

రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం (STO) లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు. బాధితుడి నుంచి రూ. 1,00,000 (లక్ష రూపాయలు) లంచం తీసుకుంటుండగా సంబంధిత అధికారులను ఎసిబి బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు, పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ట్రెజరీ (STO) కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తూ పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. లంచం డిమాండ్ చేసిన అధికారులపై కేసు నమోదు చేసి, ఎసిబి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఎసిబి అధికారులు సూచించారు.

Previous న్యాయమాఎక్కడ ఉన్నావ్... మంజుల పత్తిపాటి
Next ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సృష్టిస్తున్న దివ్యాంగ విద్యార్థులు
ADVERTISEMENT