| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

న్యాయమాఎక్కడ ఉన్నావ్... మంజుల పత్తిపాటి

న్యాయమాఎక్కడ ఉన్నావ్... మంజుల పత్తిపాటి

డైలీ భారత్ స్పెషల్:

న్యాయమాఎక్కడ ఉన్నావ్...

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నదిధర్మం..!

పచ్చని ప్రకృతిలో నరమేధం జరుగుతుంటే...

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నదిధర్మం..!

వ్యవసాయమే భారమై గోమాతలను అమ్మేస్తు

రైతన్న బసవన్న తాడును ముద్దాడుతుంటే…

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నదిధర్మం..!

తల్లి ప్రసవవేదన నుండి ఊపిరి పోసుకున్న

 అరుణ పుష్పాన్ని ఆడపిల్ల అని నలిపేస్తుంటే...

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నదిధర్మం..!

మహిళలను వరకట్న పేరుతో అగ్నికి ఆహుతి చేస్తుంటే..

మహిళలని వంటింటికి  పరిమితం చేసి  

 ఉక్కు పాదం తో తోక్కి పడేస్తుంటే...

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నదిధర్మం..!

సమాజ శ్రేయస్సు సమాజ అభివృద్ధి నెపంతో

స్వలాభం కోసం అడవి తల్లిని అంతం చేస్తూ ఉంటే...

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నదిధర్మం..!

అధికార దాహంతో  ధన దాహంతో….

 ఎందరో అమాయక ప్రజలు నడ్డి విరుస్తూంటే ...

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నదిధర్మం..!

రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి

చరవాణి 9347042218

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ.

Previous పాపకొల్లు ముద్దుబిడ్డకు ఎంబీబీఎస్ సీటు... గ్రామానికి గర్వకారణంగా నిలిచిన రోకటి సుష్మ
ADVERTISEMENT