| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాపకొల్లు ముద్దుబిడ్డకు ఎంబీబీఎస్ సీటు... గ్రామానికి గర్వకారణంగా నిలిచిన రోకటి సుష్మ

పాపకొల్లు ముద్దుబిడ్డకు ఎంబీబీఎస్ సీటు... గ్రామానికి గర్వకారణంగా నిలిచిన రోకటి సుష్మ

డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన రోకటి రమేష్ (రాము) రెండవ కుమార్తె రోకటి సుష్మ ఎంబీబీఎస్ సీటు సాధించి గ్రామ ఖ్యాతిని చాటింది.

చిన్ననాటి నుండి చదువులో చురుకైన సుష్మ, ఎన్నో కష్టాలకోర్చి వైద్య విద్యలో సీటు సాధించడం పట్ల గ్రామస్తులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పేద కుటుంబం నుండి వచ్చి వైద్యరంగంలో అడుగుపెట్టడం నిజంగా అభినందనీయం. తండ్రి రమేష్ కష్టం, కూతురు సుష్మ ఇష్టం కలిస్తేనే ఈ ఎంబీబీఎస్ సీటు సాధ్యమైందని గ్రామస్తులు అంటున్నారు. కీర్తిశేషులు రోకటి వీరయ్య గారి వారసత్వాన్ని వైద్యరంగంలోకి తీసుకెళ్తున్న మనవరాలు సుష్మ అని కొనియాడారు.

భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి పేద ప్రజలకు సేవ చేయాలని గ్రామ పెద్దలు ఆమెను అభినందించారు. పాపకొల్లు పల్లె నుండి వైద్య కళాశాల దాకా సాగిన సుష్మ ప్రయాణం ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తిదాయకం.

Previous తెలంగాణ బార్ కౌన్సిల్‌కు కొత్త చైర్మన్‌గా రాంరెడ్డి
ADVERTISEMENT