| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ బార్ కౌన్సిల్‌కు కొత్త చైర్మన్‌గా రాంరెడ్డి

తెలంగాణ బార్ కౌన్సిల్‌కు కొత్త చైర్మన్‌గా రాంరెడ్డి

డైలీ భారత్ డెస్క్ : తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సాముల రామ్‌రెడ్డి చైర్మన్‌గా, చలకాని వెంకట్ యాదవ్ వైస్ చైర్మన్‌గా, జి.కిరణ్ కుమార్ బీసీఐ సభ్యుడిగా ఎన్నికయ్యారు.చైర్మన్ పదవికి రామ్‌రెడ్డికి 12, మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం అశోక్ గౌడ్‌కు 11 ఓట్లు రాగా, ఒక్క ఓటు తేడాతో రామ్‌రెడ్డి గెలిచారు.వైస్ చైర్మన్ పదవికి వెంకట్ యాదవ్‌కు 13, జకీర్ హుస్సేన్ జావెద్‌కు 10 ఓట్లు రాగా మూడు ఓట్ల ఆధిక్యంతో వెంకట్ యాదవ్ నెగ్గారు, బీసీఐ స్థానంలో జి.కిరణ్ కుమార్ జగదీశ్వర్ రావుపై 3 ఓట్ల తేడాతో గెలిచారు.ఎనిమిదేళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరి 30న నిర్వహించగా, ఓట్ల లెక్కింపు మార్చి 24న పూర్తయింది.

Previous సిరిసిల్లలో కాంగ్రెస్ బలోపేతంపై దిశానిర్దేశం... బూత్ స్థాయి నుండే పార్టీని బలపరుద్దాం : పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు
ADVERTISEMENT