| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రక్తదాతలే ప్రాణదాతలు: కామారెడ్డిలో 96 మంది రక్తదానం : DSP, CI ప్రశంసలు

రక్తదాతలే ప్రాణదాతలు: కామారెడ్డిలో 96 మంది రక్తదానం : DSP, CI ప్రశంసలు

కామారెడ్డి,డైలీ భారత్: రక్తదాతలే ప్రాణదాతలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీఎస్పీ మధుసూదన్, సీఐ నరహరి పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డీఎస్పీ, సీఐలు రక్తదానం చేసిన 96 మంది దాతలకు హెల్మెట్లు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. రక్తదాతలకు హెల్మెట్లు ఇవ్వడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా IVF సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007లో 35 మందితో మొదలైన సంస్థ నేడు 3500 మంది సభ్యులతో రాష్ట్రంలోనే అతిపెద్ద రక్తదాతల సమూహంగా ఎదిగిందన్నారు. 19 ఏళ్లలో 30 వేల యూనిట్ల రక్త సేకరణ చేశామని, తలసేమియా చిన్నారుల కోసం చేసిన సేవలకు గాను ఇండియా, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించామన్నారు. ఇప్పటివరకు 4000 హెల్మెట్లు పంపిణీ చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ వేద ప్రకాష్, జమీల్ అహ్మద్, పర్ష వెంకటరమణ, ఎర్రం చంద్రశేఖర్, జలిగామ శ్రీకాంత్, ప్రిన్సిపాల్ డా. ఎస్.కె.రషీద్, సీఈవో జైపాల్ రెడ్డి, చిలువేరి మారుతి, దొంతి సుధాకర్, రంగ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Previous ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సృష్టిస్తున్న దివ్యాంగ విద్యార్థులు
ADVERTISEMENT