డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంజూరు పత్రం అందజేశారు. తొమ్మిదేళ్ల తర్వాత విడుదలైన ఈ కోటా ద్వారా ఒక్కో ఇంటికి రూ. 72 వేల ఆర్థిక సాయం అందనుంది. తొమ్మిదేళ్ల తర్వాత రూరల్ కోటా కింద ఈ ఇళ్లు మంజూరు కావడం విశేషం.
News
తెలంగాణకు కేంద్రం శుభవార్త.. 2 లక్షల ఇళ్లకు ఆమోదం