| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేములవాడ ఎంపీడీవో కార్యాలయంలో చోరీ కలకలం... ఫ్యాన్, వైర్లు ఎత్తుకెళ్లిన దుండగులు

వేములవాడ ఎంపీడీవో కార్యాలయంలో చోరీ కలకలం... ఫ్యాన్, వైర్లు ఎత్తుకెళ్లిన దుండగులు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:వేములవాడ పట్టణంలోని రూరల్ మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు కార్యాలయంలోకి చొరబడి ఒక ఫ్యాను, కేబుల్ వైరును ఎత్తుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

మంగళవారం ఉదయం విధులకు వచ్చిన మహిళా సిబ్బంది కార్యాలయాన్ని శుభ్రపరుస్తున్న సమయంలో ఈ చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పరిసరాలను గమనించిన ఆమె వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి, ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీమ్‌ను రప్పిస్తున్నట్లు తెలిపారు. అసలు ఈ చోరీ ఎలా జరిగింది? ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Previous కబడ్డీ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సిహెచ్ రాజు
ADVERTISEMENT