| Daily భారత్
Logo




వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.......11 గంటలు అందులోనే ప్రయాణికులు

News

Posted on 2024-09-01 08:48:10

Share: Share


వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.......11 గంటలు అందులోనే ప్రయాణికులు

డైలీ భారత్, వరంగల్ జిల్లా: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జనాలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. వరంగల్‌ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వరదల్లో చిక్కుకుంది. వరంగల్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న TS24Z 0018 నెంబరు గల ఆర్టీసీ బస్సు నెక్కొండ – వెంకటాపురం చెరువు కట్ట పైన నిన్న రాత్రి 9గంటల ప్రాంతంలో వరద ప్రభావంతో చిక్కుకుపోయింది. వెంకటాపురం వద్ద తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగడంతో వీరు చిక్కుకుపోయారు. ఈ బస్సులో దాదాపుగా 45 మంది ప్రయాణికులున్నారు. రాత్రి నుండి ముందుకు వెనకకు పోలేక ప్రాణాపాయ పరిస్థితిలో సహాయం కోసం ఎదురు చూశారు ప్రయాణికులు. తమకు తాగడానికి మంచినీళ్లు కూడా లేవని బస్సులో చిన్న పిల్లలు ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమను రక్షించాలంటూ వేడుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గ్రామానికి చేరుకుని… ట్రాక్టర్‌ సహాయంతో ప్రయాణికులను రక్షించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. వర్షం తగ్గిన తర్వాత వారి గమ్యస్థానాలకు తరలిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఇక మరో ఘటనలో విజయవాడ నుంచి మధిర వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మీనవోలు వద్ద వరదలో చిక్కుకుంది. స్థానికులు తాడు సాయంతో బస్సులో ఉన్న ప్రయాణికులను అవతల ఒడ్డుకు చేర్చారు.

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >