Posted on 2024-09-01 08:47:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి.శుక్రవారం రాత్రి మొదలైన వాన యమజోరుగా కురుస్తుంది. మరో రెండు రోజులు పాటు వర్షాలు ఇలాగే పడుతాయంటూ వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ ఎలర్ట్ కూడా జారీ చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో అత్యధికంగా 299.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోదాడలో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో రెండు కార్లు, ఆటోలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. అయితే కొట్టుకుపోయిన ఓ కారులో డెడ్ బాడీ ఉన్నట్లుగా స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే కారులో ఉండగానే వ్యక్తి చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇక నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో తల్లీకూతురు హనుమమ్మ(78), ఆమె రెండో కూతురు అంజిలమ్మ(38) మృతిచెందారు. భర్త చనిపోవడంతో అంజిలమ్మ తన తల్లి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో కురుస్తున్న వర్షాలకు శనివారం రాత్రి ఇల్లు కూలిపోవడంతో తల్లీకూతురు మృతి చెందారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >