| Daily భారత్
Logo




మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి

News

Posted on 2026-03-08 04:10:36

Share: Share


మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి

లోక్ అదాలత్ కోసం అధికారులతో జాతీయ లోక్ అదాలత్ సన్నాహాక సమావేశం

షాద్ నగర్ ఎసిపి లక్ష్మీనారాయణ, నియోజకవర్గంలోని ఆయా పోలీస్ స్టేషన్ల సిఐల హాజరు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మార్చి 28న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కోర్టు సముదాయంలో జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని బాధ్యత విధంగా నిర్వహించాలని 16వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ స్వాతి రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కోర్టులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో జిల్లా అదనపు జడ్జ్ ఎస్ స్వాతి రెడ్డి తో పాటు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కొత్త రవి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం సాహితీ, షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం, నందిగామ సిఐ ప్రసాద్, కొత్తూరు సిఐ నరసయ్య, కేశంపేట నరహరి, చౌదరి గూడ ఎస్సై విజయ్ కుమార్, కొందుర్గు ఎస్సై వెంకటేష్ అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సబియా సుల్తాన తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్ స్వాతి రెడ్డి పోలీసులు బ్యాంకు అధికారులతో మాట్లాడారు. ఘర్షణలు వ్యక్తిగత దూషణలు బ్యాంకులకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులు తదితర కేసులకు సంబంధించి పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఎంత ఉపయోగపడుతుందని ఈ అదాలత్ ద్వారా కక్షిదారులను రాజీపరిచి కేసులను తీసి వేసుకునేందుకు మంచి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ స్థాయిలో కేసులను రాజీపరచుకునే విధంగా పోలీసు శాఖ అదేవిధంగా బ్యాంకుల యాజమాన్యం కృషి చేయాలని న్యాయమూర్తి సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల షాద్ నగర్ పట్టణ సిఐగా బాధ్యతలు చేపట్టిన సీతారాం జిల్లా అదనపు జడ్జి ఎస్ స్వాతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆమెకు పూల మొక్కను బహుకరించారు..

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >