| Daily భారత్
Logo




ముగ్గురు కూతుళ్లను హతమార్చిన కసాయి తండ్రి

News

Posted on 2026-03-08 04:46:57

Share: Share


ముగ్గురు కూతుళ్లను హతమార్చిన కసాయి తండ్రి

డైలీ భారత్, కామారెడ్డి: మొన్న ఇద్దరు.. నిన్న ముగ్గురు.. రెండు రోజుల్లో ఐదుగురు చిన్నారుల మిస్సింగ్‌.. అందులో చెరువులో శవాలై తేలిన ముగ్గురు చిన్నారులు.. ఈ మిస్సింగ్స్‌, డెత్స్‌ కామారెడ్డి జిల్లాలో మిస్టరీగా మారాయి. పదేళ్లలోపు ఐదుగురు చిన్నారులు.. రెండు రోజుల్లో మిస్సవడం.. ముగ్గురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ముగ్గురి మృతదేహాలు చెరువులో లభ్యమవడం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ.. కామారెడ్డిలో ఏం జరుగుతోంది?.. ఈ మిస్సింగ్స్‌, మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?

కామారెడ్డి టౌన్‌లోని ఆర్‌బీనగర్‌ కాలనీకి చెందిన సీపల్‌, అయాత్, మరియం అనే ముగ్గురు చిన్నారులు నిన్న ఉదయం నుంచి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ముగ్గురూ అక్కాచెల్లెళ్లు కాగా.. రాత్రికి చెరువులో శవాలుగా తేలడం తీవ్ర విషాదం నింపుతోంది. అయితే.. నిన్న ఉదయం ముగ్గురు కూతుళ్లను ఆటోలో తీసుకెళ్లిన తండ్రి.. ఓ షాపు దగ్గర దింపి కిరాయికి వెళ్లినట్లు చెప్తున్నాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు పిల్లులు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. అదేసమయంలో ఆటోకు సంబంధించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపిస్తున్నాయి. కానీ.. మిస్సింగ్‌ కేసు నమోదు గాలింపు చేపట్టిన పోలీసులు.. సమీపంలోని చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యం కావడం షాకిచ్చింది.

ముగ్గురు చిన్నారుల మృతి ఘటనలో చిన్నారుల తండ్రిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.. దీంతో కామారెడ్డి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. అయితే.. పిల్లలను తానే చంపినట్టు ఒప్పుకున్నాడు తండ్రి ఇస్మాయిల్‌.. కుటుంబ కలహాలతో మద్యం మత్తులో తండ్రే చంపేసి చెరువులో పడేశాడా?.. లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక.. ముగ్గురు చిన్నారుల మృతితో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. భర్తే ఏదో చేసి ఉంటాడంటూ రోదిస్తోంది.


మరో ఇద్దరు చిన్నారుల అదృశ్యం.

ఇదిలావుంటే… రెండు రోజుల క్రితం కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి, విజయ్ అనే ఇద్దరు చిన్నారులు కూడా కనిపించకుండా పోయారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పదేళ్లలోపువారు కావడంతో పిల్లల అదృశ్యంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అటు.. చిన్నారుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు చెరువులో శవాలై తేలడంతో మరింత భయపడిపోతున్నారు. మొత్తంగా.. రెండు రోజుల్లో ఐదుగురు చిన్నారులు మిస్సవడం.. అందులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నిన్న మిస్సైన ముగ్గురు మృతదేహాలు లభ్యం కాగా.. శుక్రవారం అదృశ్యమైన సింహాద్రి, విజయ్‌ జాడ తెలియకపోవడం సస్పెన్స్‌గా మారుతోంది.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >