| Daily భారత్
Logo




ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-03-12 17:55:21

Share: Share


ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

నేరెళ్ల పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ..

డైలీ భారత్, తంగళ్లపల్లి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్ సీని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, మందుల గది, ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు. వ్యాక్సిన్లు, మందుల నిలువపై ఆరా తీశారు. రోజు ఆసుపత్రికి ఎందరు రోగులు వస్తున్నారని, ఎందరు గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారని ఆరా తీశారు. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలుపాలని సూచించారు. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >