| Daily భారత్
Logo




దేశంలో ఎల్పిజి కొరతపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది

News

Posted on 2026-03-12 17:24:50

Share: Share


దేశంలో ఎల్పిజి కొరతపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఎల్పిజి డిమాండ్ పెరగడంతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కాలాన్ని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది.అయితే, ఈ నిబంధన కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. నగరాల్లో పాత నిబంధనే (25 రోజులు) కొనసాగుతుందని స్పష్టం చేసింది. కొరత సాకుతో కమర్షియల్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ రంగం సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. దేశంలో అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పనిచేస్తున్నాయని పేర్కొంది. సరిపడా నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డిజీల్ను సరఫరా చేస్తున్నామని వాహనాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది.

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >