Posted on 2026-09-06 04:06:38
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలి
విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గణేష్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలి
జిల్లా ఎస్పి యం రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి:వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ దోమకొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతిరోజూ అధికారులకు తెలియజేస్తున్న సూచనలు, అంశాలు సిబ్బందికి చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని స్వయంగా సిబ్బందిని ప్రశ్నించి వారి అవగాహనను తెలుసుకున్నారు. ప్రజలతో వ్యవహరించే విధానం, ఫిర్యాదులపై స్పందన, నేర నియంత్రణ చర్యలు, స్టేషన్‌లో విధుల నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ గారు తెలియజేసిన ప్రతి సూచనను సిబ్బంది క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని సమస్యను పూర్తిగా విని, సత్వర స్పందన అందిస్తూ చట్టపరమైన పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకని పెంపొందించాలని తెలిపారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల తీరుతో పాటు పెండింగ్ కేసులు, గ్రేవ్ కేసులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసులు, వారెంట్ల అమలు, బీట్ వ్యవస్థ తదితర అంశాలపై ఎస్పీ గారు సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తుతో పాటు సాంకేతిక ఆధారాల సేకరణ, సాక్ష్యాల పరిరక్షణ, సాక్షుల వివరాల నమోదు వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు మరియు బాధితుల సమస్యలను సున్నితంగా పరిష్కరించాలని, మహిళలు, బాలలపై నేరాల విషయంలో SOP ప్రకారం నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని ఎస్పీ గారు ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి పెట్రోలింగ్, బీట్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయాలని, రాత్రి వేళల్లో గస్తీని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నేరాల నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్‌తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ నియమాలు, మహిళలు మరియు బాలల భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని సూచించారు.
రాబోయే గణేష్ పండుగను పురస్కరించుకుని ముందస్తు ప్రణాళిక రూపొందించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో ప్రజలు సంతోషంగా నిర్వహించుకునేలా సంబంధిత శాఖలతో సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లోని అన్ని రికార్డులు, రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరించి శాఖా నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహించాలని, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజా భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, భిక్నూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరేశ్, దోమకొండ ఎస్‌ఐ ప్రభాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >