| Daily భారత్
Logo




ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి

News

Posted on 2026-03-13 03:39:02

Share: Share


ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు దిగ్విజయం చేసేందుకు  ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు.గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం గ్రామంలోని వర్ధమాన ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై  సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఒక రోజు శిక్షణ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి  చేవెళ్ళ శాసన సభ్యులు కాలే యాదయ్యతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొనీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కొత్తగా సర్పంచులు గా ఎన్నికైన  అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన మీరంతా మీ సమయాన్ని వృధా చేయకుండా గ్రామాభివృద్ధికి సమయాన్ని వెచ్చించాలని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అమలు చేసేలా ఎక్కడ ఎలాంటి వైరుధ్యాలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేస్తేనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు.  99 రోజుల పాటు పది అంశాలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 2న గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి ఇందులో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజాప్రతినిధులు కీలకంగా ఉండాల్సినందున వారికి సమగ్రంగా అవగాహన కల్పించేందుకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఏమైనా సందేహాలు ఉంటే మాస్టర్ ట్రైనర్స్, అధికారులు నివృతి చేస్తారన్నారు. 99 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

చేవెళ్ళ శాసన సభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ  ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించి వారిని పథకాల అమలులో భాగస్వాములను చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ID కార్డులను, 99 రోజుల ప్రణాళిక బుక్స్ అందజేయడం జరిగింది.

అనంతరం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలోని 10 ప్రధాన అంశాలను సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. 

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డిపిఓ సురేష్ మోహన్, జిల్లా అధికారులు, మండలాల అధికారులు, సర్పంచులు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >