Posted on 2026-09-05 06:06:39
డైలీ భారత్, స్పెషల్:
నీవు వస్తావని ఆశా మామ…
కొందరు బడాబాబులు
వెంచర్ల పేరుతో
ప్రకృతిని నాశనం చేస్తూ…
ఎల్ నినో అనే భూతాన్ని
మన ముందుకు తీసుకొచ్చారు!
వాన బాణం వేసి
ఆ ఎల్ నినోను తరిమేసి,
మమ్మల్ని కాపాడు మామ..!
సద్ది తీసుకుని
పొలం కాడికి వచ్చిన నీవు,
వస్తే… నిన్ను చూస్తూ
సద్ది అన్నం తినాలని ఉంది మామ..!
నా పెనిమిటి
రాత్రింబవళ్లు అని చూడకుండా…
పొలం గట్టుమీద కూర్చొని
నీ వైపే చూస్తూ
కన్నీళ్లు పెడుతున్నాడు…
అతని కళ్లను
వాన చినుకుతో తడిపి,
మా కన్నీళ్లను తుడిచి
మమ్మల్ని కాపాడు మామ..!
నీవు రాక
వ్యవసాయ పనులు మందగించాయి…
కూలికి వెళ్లే ప్రతి ఒక్కరూ,
వ్యవసాయం చేసే ప్రతి రైతన్నా
అర్ధాకలితో అలమటిస్తున్నారు…
రా మామా…
వచ్చి మా పొలాలకు ప్రాణం పోసి,
మా ఆకలి కేకలను
చల్లార్చు మామ..!
రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి
9347042218
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం .
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >