| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేతన్నలను నిలువునా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి... బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఫైర్

నేతన్నలను నిలువునా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి... బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఫైర్

డైలీ భారత్, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనతో నేతన్నలకు ఒరిగిందేమీ లేదని, వారి ఆశలను ఒక్క గంటలోనే ఆవిరి చేశారని బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.

పర్యటనకు ముందు ఉచిత విద్యుత్, బకాయిల రద్దు అంటూ హడావుడి చేసి, సభలో ఒక్క వరం కూడా ప్రకటించకుండా నేతన్నలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు.

అంబేద్కర్, నేతన్న విగ్రహాలకు పూలమాలలు వేయకుండా సీఎం ఘోరంగా అవమానించారని ఆరోపించారు. కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిరిసిల్ల పద్మశాలీల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి బీజేపీ తరఫున పద్మశాలీ బిడ్డే గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారని స్పష్టం చేశారు.

Previous వీడిన ఇంద్ర పల్లి హరిణి మర్డర్ మిస్టరీ...
ADVERTISEMENT