| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గాంధీజీ సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం : మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి

గాంధీజీ సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం : మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి

డైలీ భారత్, సిరిసిల్ల : సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, అహింస, శాంతిని ఆయుధాలుగా చేసుకుని భారత స్వాతంత్ర్యం కోసం దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన గాంధీజీ పోరాటం ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని శాంతియుత మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాధించారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గాంధీజీ కలలు కన్న సమసమాజ నిర్మాణంతో పాటు స్వచ్ఛమైన సమాజ నిర్మాణం కోసం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా తెలంగాణను స్వచ్ఛత విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిపినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం.డి. ఖాదీర్ పాషా మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ విప్ బుర్ర మల్లికార్జున్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Previous నేతన్నలను నిలువునా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి... బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఫైర్
Next 9124983808 నంబర్ నుండి ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో ఫేక్ కాల్స్
ADVERTISEMENT