అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక
డైలీ భారత్, సిరిసిల్ల : 9124983808 నంబర్ నుండి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ పలువురు వ్యాపారులకు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సమాచారం అందిందని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
సిరిసిల్ల పట్టణంలోని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రేడ్ లైసెన్స్ ఫీజును మున్సిపల్ కార్యాలయంలో లేదా అధికారిక CDMA పోర్టల్ ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు. తెలియని వ్యక్తులు లేదా మొబైల్ నంబర్లకు ఎటువంటి నగదు / ఆన్‌లైన్ చెల్లింపులు చేయవద్దని హెచ్చరించారు.
CDMA వెబ్‌సైట్‌లో ట్రేడ్ లైసెన్స్ వివరాలు, బకాయిలు మరియు చెల్లింపు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇతర నంబర్ల నుండి ట్రేడ్ లైసెన్స్ పేరుతో అనుమానాస్పద కాల్స్ వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే లేదా వ్యక్తిగత ఖాతాలకు చెల్లింపులు కోరితే, ఆ కాల్ వివరాలు, నంబర్ మరియు ఆధారాలను భద్రపరచి సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.