క్యాష్‌లెస్ హెల్త్ కార్డుల కోసం సీఎం రేవంత్‌కు పోస్ట్‌కార్డులతో వినతి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143), తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ (TEMJU) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి.
రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ పిలుపు మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్లలో పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని గాంధీ విగ్రహానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం ఎదుట జర్నలిస్టులకు హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం జర్నలిస్టులు సిరిసిల్ల హెడ్ పోస్టాఫీసుకు చేరుకుని “అర్హులైన జర్నలిస్టులందరికీ క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి” అనే ప్రధాన డిమాండ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టుకార్డులు పంపించారు.
విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, ప్రమాదాల దృష్ట్యా వారి ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య భద్రత కల్పించాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామల గట్టు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి, అనిల్ రావు, పరశురాం, కంటాల విజయ్, పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి రఘువీర్, మల్లిక్, కాశీ, తంగళ్లపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరసయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ, ఫహద్ పాషా, ఇమ్రాన్, నయీం, బాలరాజు, బాబు, సలీం, నాగరాజు, అస్లాం, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.