Posted on 2026-09-04 14:28:48
కాంగ్రెస్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో భారీ నిరసన – పోతుగంటి శ్యామ్ సుందర్ రెడ్డి
డైలీ భారత్, కామారెడ్డి : లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ గారు మరియు నహీం భాయ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు మాచారెడ్డి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోతుగంటి శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల గౌరవం కోసం నిలబడుతున్న రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సరికాదని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, దళితుల హక్కులు మరియు ఆత్మగౌరవం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో కుల వివక్షకు సంబంధించిన ఘటనపై బాధ్యులైన వారిపై ప్రభుత్వం వెంటనే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని శ్యామ్ సుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ పోరాటం ఏ ఒక్క వ్యక్తి కోసం కాదని, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవం మరియు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమేనని శ్యామ్ సుందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల తరఫున పోరాడుతుందని అన్నారు.
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రధానంగా మూడు డిమాండ్లను ప్రభుత్వ ముందు ఉంచారు:
1. రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే బేషరతుగా ఉపసంహరించాలి.
2. కుల వివక్షకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి.
3. దళితుల గౌరవం, రాజ్యాంగ హక్కులకు పూర్తి భద్రత కల్పించాలి.
ఈ కార్యక్రమంలో మాచారెడ్డి PACS చైర్మన్ నౌసీలాల్ గారు, మాచారెడ్డి ఉపసర్పంచ్, జిల్లా ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షులు దుంపటి రాజు , PACS డైరెక్టర్ పిట్ల శ్రీనివాస్ , కాంగ్రెస్ నాయకులు నూతికాడి సంతోష్ , ఈరమ్ రాకేష్ , నామాల రమేష్ బొండ్ల తిరుపతి , జంగం నాగరాజు , గోరంట్ల బాల్నర్సు తదితరులు పాల్గొన్నారు.
అలాగే కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >