Posted on 2025-11-12 19:10:42
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ నవదుర్గ మాత ఆలయం 5వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్ అలుక కిషన్ ఆధ్వర్యంలో, కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ, ఖజానాదారు సత్యనారాయణ, సభ్యులు ఉమా కిరణ్, సత్యం, గంధం వెంకటేశ్వర్లు, పెద్దోళ్ల నాగరాజు తదితర కమిటీ సభ్యుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, హాజరై, భక్తులకు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించిన వారు, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆలయంలో నిర్వహించిన మహా పూజలు, హోమాలు, అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం వంటి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువతులు పెద్ద ఎత్తున హాజరై దేవీదర్శనం చేసుకున్నారు. భక్తి నమ్మకాలు, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యత ప్రతిఫలించిన ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది.
ఈ సందర్భంగా చైర్మన్ అలుక కిషన్ మాట్లాడుతూ “భక్తుల సహకారంతో ఆలయం ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి సాధించిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని” తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని భక్తులు, అధికారులు, కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >