| Daily భారత్
Logo




పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

News

Posted on 2026-05-05 13:26:42

Share: Share


పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

డైలీ భారత్, ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. పద్మజ మృతి కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఆమె భర్తే హత్య చేసినట్లు గుర్తించారు. పద్మజ భర్త కిరణ్‌ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ప్రొద్దుటూరు పోలీసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. లావుగా ఉండటంతో పాటుగా, నిత్యం అనుమానిస్తోందనే కోపంతో పాలకోవాలో విషం కలిపి.. ఆపై దిండుతో అదిమి కిరణ్ కుమార్ తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ హత్య కేసు మిస్టరీ వీడింది. భర్త కిరణ్ కుమార్.. పద్మజను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ కుమార్, ముద్దనూరుకు చెందిన పద్మజకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు ఏడేళ్ల పాప కూడా ఉంది. అయితే కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. భార్య భర్తల మధ్యన మనస్పర్థలు తలెత్తాయి. దీనికి తోడు తన భార్య లావుగా ఉందని.. ఎక్కువగా తింటోందని కిరణ్ కుమార్ భావిస్తూ వచ్చాడు. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు

భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్న కిరణ్.. అందుకు పక్కా స్కెచ్ వేసుకున్నాడు. ముందుగా విషం పెట్టి భార్యను హత్య చేయటం ఎలా అనే దానిపై యూట్యూబ్‌లో శోధించాడు. ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసి హైదరాబాద్ నుంచి విషం తెప్పించుకున్నాడు. ఈ విషాన్ని పాలకోవాలో కలిపిన కిరణ్ కుమార్.. భార్య పద్మజకు తినిపించాడు. భార్య అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత.. ఇంకా చనిపోలేదని, దిండుతో అదిమి హత్య చేసినట్లు ప్రొద్దుటూరు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ కేసులో నిందితుడైన కిరణ్‌కు వివాహేతర సంబంధం కూడా ఉందని ప్రొద్దుటూరు పోలీసులు తెలిపారు. ఏడాది కిందట హైదరాబాద్‌లో ఉన్న సమయంలో వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందని.. అయితే పద్మజ హత్యకు, ఆ మహిళకు సంబంధం ఉన్నట్లు ఇప్పటి వరకూ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.

చంపాలని నిర్ణయించుకుని.. ప్రేమగా ఇంటికి తెచ్చి, పాలకోవాలో విషం పెట్టి..

భార్యభర్తల మధ్య విభేదాలు రావటంతో గత కొంతకాలంగా పద్మజ తల్లివద్ద ఉంటోంది. అయితే భార్యను చంపాలని నిర్ణయించుకున్న కిరణ్.. ఆమెను పుట్టింటి నుంచి తన ఇంటికి తెచ్చాడు. ప్రేమగా నచ్చజెప్పి ఆమెను ఒప్పించి ఇంటికి తెచ్చిన కిరణ్.. మూడు రోజులు ఆమెతో బాగానే ఉన్నాడు. ఏప్రిల్ 29వ తేదీ హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా తెచ్చిన విషాన్ని పాలకోవాలో కలిపి.. ఆమెకు తినిపించి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పద్మ తల్లిదండ్రులకు ఆమె చనిపోయిందని సమాచారం అందించాడు

అయితే కిరణ్ మీద అనుమానంతో పద్మజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి పద్మజ పోస్టుమార్టం నివేదికలో కొన్ని అనుమానాలు వ్యక్తం కావటంతో.. పోలీసులు కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో కిరణ్ నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >
Image 1

రాఖీ పండుగ

Posted On 2026-08-28 02:56:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Posted On 2026-08-27 19:02:09

Readmore >
Image 1

మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి

Posted On 2026-08-27 19:00:55

Readmore >
Image 1

అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-27 17:17:45

Readmore >
Image 1

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి

Posted On 2026-08-27 17:15:17

Readmore >
Image 1

సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా

Posted On 2026-08-27 16:57:22

Readmore >
Image 1

హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన

Posted On 2026-08-27 16:49:27

Readmore >