Posted on 2026-05-05 12:54:21
సమస్యలు ఉంటే పెద్దన్న గా అండగా ఉంటా
మహిళల భద్రత కు పోలీస్ కృషి.
మహిళా పోలీసులు ధైర్యంగా గర్వంగా పనిచేయాలి.
పని ప్రదేశంలో వేధింపులపై దైర్యంగా పిర్యాదు చేయాలి
కె నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
డైలీ భారత్, సూర్యాపేట: పని ప్రదేశంలో ఆత్యాచార వేదింపులు నిరోధక చట్టం - 2013 POSH ACT - 2013" (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్‌మెంట్ ఎట్ వర్క్ ప్లేస్) కు సంభందించి జిల్లా పోలీసు కార్యాలయం నందు మహిళా పోలీసు అధికారులకు, మహిళా రక్షణ విభాగం సిబ్బందికి, మహిళా శిశు సంక్షేమం వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ హాజరై మహిళా భద్రత ను ఉద్దేశించి మాట్లాడారు, సలహాలు, సూచనలు అందించారు. మహిళా పోలీసు సిబ్బంది సంక్షేమం, సమస్యలు అంశాల గురించి మాట్లాడారు. సమస్యలు వస్తే మహిళా పోలీసు సిబ్బందికి జిల్లా అధికారిగా పెద్దన్నలాగా అండగా ఉంటానని ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తెలియజేయాలని కోరారు. సమాజంలో వివిధ సమస్యలపై శక్తికి మించి పనిచేయాలని గర్వంగా ధైర్యంగా ఉండాలని సూచించారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేదింపులు, సమస్యలపై పోలీసు మహిళా సిబ్బంది స్పందించి సహాయ సహకారాలు అందించాలి అన్నారు. వేధింపులపై దైర్యంగా పిర్యాదు చేసి వాటి నిర్మూలనకు పాటుపడాలి అన్నారు. మహిళా పోలీస్ యూనిఫాం ధరించి రోడ్డు పై కనిపిస్తే ఆకతాయిల మదిలో అలజడి ఏర్పడుతుంది, భయం కలుగుతుంది అని అన్నారు. మహిళా సిబ్బంది ధైర్యంగా గర్వంగా పనిచేయాలని శక్తికి మించి సేవలందించాలని తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమంలో అనేక విధాలుగా కృషి చేస్తున్నామని పోలీస్ సబ్సిడరీ సెంట్రల్ క్యాంటీన్ ఏర్పాటు చేశామని వ్యాయామశాల క్రీడా మైదానాలు అభివృద్ధి చేశామని అన్నారు. మహిళా ఉద్యోగులు పని ప్రదేశంలో వివిధ రకాల వేధింపులకు గురవుతున్నట్లు అనేక సందర్భాల్లో మీడియాలో ప్రచురితమైనది, కేసులు నమోదు అవుతున్నాయని వీటిని నిర్మూలించడంలో మహిళలు శక్తివంతంగా ఉండాలని ధైర్యంగా ఫిర్యాదు చేసి వేధింపులను అరికట్టాలని కోరారు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో "POSH ACT - 2013" (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్‌మెంట్) ప్రకారం జిల్లా పోలీస్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి అధ్వర్యంలో 12 మంది మహిళా పోలీస్ అధికారులతో ఒక ఇంటర్నల్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం, అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నందు కూడా సంభందిత అధికారుల అధ్వర్యంలో ఆఫీస్ ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేశారు, జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్ కార్యాలయం నందు శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో కమిటీ పని చేస్తుంది అన్నారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు ఎవరైనా గురి చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదును సంబంధిత కమిటీలకు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
కార్యక్రమం నందు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఎస్పీ ప్రసన్న కుమార్, బెటి బచావో బిటి పడావో నిర్వహుకురాలు చైతన్య, జిల్లా మహిళా బరోసా సెంటర్ SI మౌనిక, డిసిఆర్బి ఎస్ఐ ఝాన్సీరాణి, జిల్లా షీ టీమ్స్ SI నీలిమ, బరోసా సెంటర్ సిబ్బంది, అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్ సబితారాణి, శ్రీదేవి, కరుణశ్రీ, మహిళా ASI లు సైదాబి, జ్యోతి, అరుణ, కవిత, పోలీస్ స్టేషన్ రిషప్షన్ సెంటర్స్ మహిళా సిబ్బంది, షీ టీమ్స్, బరోసా సెంటర్ సిబ్బంది ఉన్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >