Posted on 2026-08-27 17:17:45
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి నియోజకవర్గంలోని అంతంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన PACS చైర్మన్‌గా చిట్టెడి సుధాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, నూతన పాలకవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు ఆర్థికంగా బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
రైతులకు అవసరమైన పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సేవలు సకాలంలో అందించడంలో PACSలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. PACSలు కేవలం రుణాలు అందించే సంస్థలుగా కాకుండా రైతుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే కేంద్రాలుగా పనిచేయాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని షబ్బీర్ అలీ తెలిపారు.
రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అంతంపల్లి PACS నూతన చైర్మన్ చిట్టెడి సుధాకర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన షబ్బీర్ అలీ,
రైతులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకు సమానంగా సేవలందిస్తూ PACSను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి తదితర గ్రామాల రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు సహకారం అందిస్తానని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు.
కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
ప్రజా సంక్షేమంతో పాటు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, అంతంపల్లి సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి, లింగారెడ్డి, బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, తిప్పాపూర్ సొసైటీ చైర్మన్ భీంరెడ్డి, కామారెడ్డి సొసైటీ చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, చుక్కాపూర్ లక్ష్మీనర్సింహ ఆలయ చైర్మన్ కమలాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, సుదర్శన్, కౌన్సిలర్ మోతిలాల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు భూమని బాలరాజ్, తాటిపాముల లింబాద్రి, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్, యాదవ రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
అనంతరం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించి, అర్హులైన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >
అర్హులైన ఒక్క ఓటరు ఓటు కూడా తొలగిపోకూడదు... తంగళ్లపల్లి గ్రామసభలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
Posted On 2026-08-27 15:58:53
Readmore >
"ఫీజుల బకాయి... బీజేపీ లడాయి"... సిరిసిల్లలో BJYM భారీ ధర్నా, ప్రభుత్వానికి రాగుల రాజిరెడ్డి వార్నింగ్
Posted On 2026-08-27 15:50:17
Readmore >
నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"
Posted On 2026-08-27 07:58:21
Readmore >
గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!
Posted On 2026-08-27 05:16:28
Readmore >
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >