| Daily భారత్
Logo




నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"

News

Posted on 2026-08-27 07:58:21

Share: Share


నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"

డైలీ భారత్, నిజామాబాద్: ప్రజల మంచికోరి చేసిన చట్టంతో ప్రజలతో రాక్షస క్రీడ ఆడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ కు ప్రజలు తగిన బుద్ది చెబుతారని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది వ్యవసాయ, వ్యవసాయేతర భూముల అమ్మకపు లావాదేవీలు ఆపడమంటే ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాచి వేయడమేనని అన్నారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22 (ఎ )ఏ భూమినైనా నిషేధిత జాబితాలో చేర్చే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చిందని కాని ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వలాభమే కాంగ్రెస్ విధానంగా మారిందని ఆయన ఆరోపించారు. భూ క్రయ విక్రయాలతోని ప్రభుత్వానికి లాభం రావలసిన చోట ప్రభుత్వ ఖాజానకు కన్నం వేస్తూ కాంగ్రెస్ ఖాజానా నిండితే చాలానే తీరుగా రేవంత్ ప్రభుత్వ నడవడిక ఉందని మధుసుధన్ రావు దెప్పి పొడిచారు. ప్రజల ఆర్థిక స్థితిగతులతో ఆటాలాడుకునే కాంగ్రెస్ నైజంకు ఎవరు అధికారం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆర్థిక ప్రగతికి అనువుగా ఉండి తద్వారా రాష్ట్ర పురోభివృద్ధికి బాటలు వేసే భూముల అమ్మకం కొనుగోలను ఎలాంటి ఆంక్షలు లేకుండా నిషేధిత భూముల కోసమంటు ప్రయోగించిన సెక్షన్ 22(ఎ ) వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Image 1

నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"

Posted On 2026-08-27 07:58:21

Readmore >
Image 1

గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!

Posted On 2026-08-27 05:16:28

Readmore >
Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >