డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని పెద్దబోనాల నుంచి గణేష్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పెద్దబోనాల మెయిన్ రోడ్డు పక్కన కూడా విచ్చలవిడిగా చెత్త పారవేస్తున్నారు.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. చెత్త కుప్పల వల్ల పందులు చేరి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోంది. ఇది ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరంగా మారింది.
మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలని, చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని, ఇది ఎవరికో వ్యతిరేకంగా కాదని, ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం చేస్తున్న విజ్ఞప్తి అని సోషల్ యాక్టివిస్ట్ అన్నారం సాయికుమార్ తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
#DailyBharath #Sircilla #Garbage #Municipal