డైలీ భారత్, ఉరవకొండ: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ABABS ఏపీ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడిగా కొట్టాం జయరాం ను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య మీడియాకు తెలిపారు.
ఏపీ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన కొట్టాం జయరాం ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతినిత్యం అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని, సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
#DailyBharath #Uravakonda #Ayyappa #ABABS