డైలీ భారత్, దమ్మపేట: దమ్మపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ జరిగింది.
ఈ కార్యక్రమంలో నవంబర్ 30న దమ్మపేట తాసిల్దార్ కార్యాలయం ముందు ఆదివాసి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని ప్రతి గూడెం నుంచి ప్రతి ఆదివాసి తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.
1/70 చట్టాన్ని ఏజెన్సీ ప్రాంతంలో పటిష్టంగా అమలు పరచాలని నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను రద్దు చేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఐదవ షెడ్యూల్ భూభాగం ఆదివాసులదేనని స్పష్టం చేశారు.
ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరులను మైదాన ప్రాంతాలకు పంపించాలని, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు అక్రమంగా నిర్మించే బహుళ అంతస్తులను కూల్చివేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ నాయకులు సోయం మోహన్ దొర, నారం పోతురాజు, కుంజ చిన్నబాబు, బండారు సూర్యనారాయణ, ధారబోయిన పోతురాజు, కీసరి వెంకటస్వామి, గడ్డం వెంకటేశ్వరరావు, తోలేం శ్రీను, వాసం వెంకటేశ్వరరావు, కారం బొజ్జి, తంబళ్ల రవి, తాటి రాము, మడకం ప్రసాద్, కాకా శివశంకర్ ప్రసాద్, కారం నాగేంద్రబాబు, కొర్సా వెంకటేష్ దొర, కారం బోడయ్య, వనమా వెంకటేశ్వరరావు, వాసం సోమమ్మ, సంఘం మంగరాజు, వనం వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
#DailyBharath #Dammapeta #Adivasi #JAC