డైలీ భారత్, ముస్తాబాద్: పోతుగల్ గ్రామానికి చెందిన దానవేని సమ్మయ్య, తండ్రి కేశవులు, జనగాంకు బేరం చేయడానికి వెళ్లి అక్కడ ఒక మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ఇంటికి పోతుగల్ కు తీసుకొని వచ్చాడు.
సమ్మయ్య తల్లిదండ్రులు దానవేని కేశవులు మరియు దానవేని కనుకవ్వ ఆ బాలికతో సమ్మయ్యకు వివాహం జరిపించారు.
ఈ విషయంలో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు జనగాం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా, ఆ కేసును జనగాం పోలీసులు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసును రీ రిజిస్టర్ చేసి విచారణ చేపట్టారు.
విచారణ అనంతరం కేసు అధికారి కె. నాగేంద్ర చారి, డిఎస్పి సిరిసిల్ల, నవంబర్ 28, 2026 రోజున నిందితుడు దానవేని సమ్మయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.
#DailyBharath #Musthabad #RajannaSircilla