| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మొన్న నెమళ్లు నేడు జింక కొమ్ములు! వన్యప్రాణులకు రక్షణ ఎక్కడ? అటవీ శాఖ పెట్రోలింగ్ పై విమర్శలు!

మొన్న నెమళ్లు నేడు జింక కొమ్ములు! వన్యప్రాణులకు రక్షణ ఎక్కడ? అటవీ శాఖ పెట్రోలింగ్ పై విమర్శలు!

నిఘా లోపం వల్లనే జింక కొమ్ములు నగరంలోకి!

బాల్కొండలో నెమళ్ల వేట మరవక ముందే నిజామాబాద్ సంతలో జింక కొమ్మల విక్రయం!

పోలీసులు పట్టుకుంటేనే వేట బయట! అటవీ శాఖ పెట్రోలింగ్ ఎక్కడ?

వారంతపు సంతలో జింక కొమ్మల విక్రయం! అరుదైన మృగాలకు ముప్పు!

అంతరిస్తున్న అరుదైన వన్యప్రాణులు!

డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ లోని వారంతపు సంతలో కృష్ణ జింక కొమ్ములను పుర్రెతో సహా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఉత్తర అటవీ రేంజ్ అధికారి బి. సంజయ్ గౌడ్ తెలిపారు.

నిందితుడిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడకు చెందిన వోలెన్ లోకేశ్, 37, గా గుర్తించామన్నారు.

నిందితుడిని శనివారం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారని వివరించారు.

ఇటీవల బాల్కొండ నియోజకవర్గంలో జాతీయ పక్షి నెమళ్లను వేటాడి వాటిని చంపిన నిందితుల వ్యవహారం మరవక ముందే తిరిగి ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల అటవీ శాఖ అధికారులపై పలు విమర్శలకు తావిస్తుంది.

అసలు జిల్లాలో ఆ శాఖ అధికారులు పెట్రోలింగ్ లాంటి వ్యవస్థను నిర్వహిస్తున్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది.

మొన్న బాల్కొండ పరిధిలో నెమలి వేటలో పోలీసులకు అనుమానం వచ్చి నిందితులను పట్టుకోగలిగారే తప్ప అటవీ శాఖ అధికారులు చేసిందేమీ లేదు అని స్థానికులు అంటున్నారు.

జిల్లాలో అటవీ శాఖ అధికారులు ఇలాంటి మొద్దు నిద్ర వేయిస్తే అడవుల్లో ఉండే అరుదైన మృగాలు అంతరించే ప్రమాదం ఎంతైనా ఉంది అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక అటవీ మృగాల తంతు ఇలా ఉంటే అటవీ ప్రాంతాల్లో ఉండే వృక్షాలను ఏ విధంగా కాపాడుతున్నారో వారికే తెలియాలి అని స్థానికులు విమర్శిస్తున్నారు.

మొన్న నెమళ్లు, నేడు జింక కొమ్ములు అంటూ వన్యప్రాణులకు రక్షణ ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిఘా లోపం వల్లనే జంతువుల కొమ్ములు నగరంలోకి వచ్చాయి అని వారు అంటున్నారు.

నగరంలోకి వన్యప్రాణుల అవయవాలు ఎలా వచ్చాయి, వెనుక ఎవరు ఉన్నారు అనే అంశంపై లోతైన విచారణ జరపాలని, సంతలు, అటవీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో నిఘాను పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

#DailyBharath #Nizamabad #Balkonda

Previous వారంతపు సంతలో జింక కొమ్మలు విక్రయిస్తున్న వ్యక్తి జైలు పాలు!
Next మాజీ డిప్యూటీ మేయర్ హత్యకు సుపారీ! బోరబండ పోలీసుల వేగవంతమైన చర్యతో కుట్ర భగ్నం!
ADVERTISEMENT