Posted on 2026-08-27 17:15:17
ఉద్యోగుల సమరభేరి...
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దాకా పోరాటం ఆపేది లేదు :TGEJAC రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ జనరల్ పులగం దామోదర్ రెడ్డి , కో చైర్మన్ చకినాల అనిల్ కుమార్
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా చౌక్ లో TGEJAC రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకు TGEJAC జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి ఆధ్వర్యం లో ఈరోజు మహాధర్న నిర్వహించడం జరిగింది. ఆ మహాధర్న శిబిరాన్ని సందర్శించిన TGEJAC రాష్ట్ర బాధ్యులు పులగం దామోదర్ రెడ్డి చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలైన పిఆర్సి,ఆరు పెండింగ్ డిఏలు,పదివేల కోట్ల బకాయి బిల్లులు అదేవిధంగా సిపిఎస్ రద్దు ఈ నాలుగు అంశాల మీద ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జిల్లా కేంద్రంలో మహా ధర్నా కామారెడ్డిలో ఘనంగా నిర్వహించినందుకు అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది "ఉద్యోగుల ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం" అని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టో ని ఇంతవరకు అమలు చేయకపోవడం చాలా శోచనీయమని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పి ఆర్ సి కి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న ఇంతవరకు ప్రకటించకపోవడం దాని అమలు చేయకపోవడం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని తెలిపారు. అదే విధంగా ఏ రాష్ట్రంలో కూడా 6 DA లు పెండింగ్లో లేవు కానీ మన రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరమైన విషయమని వెంటనే వాటిని ప్రకటించాలని కోరారు. పదివేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉండడం వల్ల పెన్షనర్ అవస్థలు మన బాధగా ఉన్నాయని ఆ బాధను ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉందని వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యమని ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేశారని ఆ సేవను గుర్తించి వెంటనే పదివేల కోట్ల ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయక ఆ మేనిఫెస్టో ను అవమానపరుస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులు వారి ప్రధాన హక్కులైనటువంటి 2prc,6 పెండింగ్ DA లు,10 వేలకోట్ల పెండింగ్ బిల్లులు CPS రద్దు ప్రకటించే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు.ఉద్యమ షెడ్యూల్లో భాగంగా సెప్టెంబర్ 10 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర మహాధర్నా కు లక్షల మంది ఉద్యోగులు హాజరయ్యి ప్రభుత్వానికి కన్నులు తెరిపించాలని కోరారు.
ఈ మహా ధర్నాలో TGEJAC జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి సెక్రెటరీ జనరల్ దేవేందర్ ,అడిషనల్ సెక్రెటరీ జనరల్ కుషాల్ కో చైర్మన్లు ఆకుల బాబు, పంపరి ప్రవీణ్ కుమార్ ,రాజు లింగంగారు,బషీర్ గారు,డిప్యూటీ సెక్రెటరీ జనరల్ ఎల్లారెడ్డి, ప్రేమ్ కుమార్,చక్రధర్, కో చైర్మన్లు నాగరాజు, సాయిరెడ్డి, చక్రధర్, దేవుల, ముజుబొద్దీన్ , విఠల్ రావు,హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్లు పర్వతయ్య,నీలం లింగం,మనోహర్, రాజకుమార్ , రాజేష్ తదితరులు పాల్గొన్నారు
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >
అర్హులైన ఒక్క ఓటరు ఓటు కూడా తొలగిపోకూడదు... తంగళ్లపల్లి గ్రామసభలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
Posted On 2026-08-27 15:58:53
Readmore >
"ఫీజుల బకాయి... బీజేపీ లడాయి"... సిరిసిల్లలో BJYM భారీ ధర్నా, ప్రభుత్వానికి రాగుల రాజిరెడ్డి వార్నింగ్
Posted On 2026-08-27 15:50:17
Readmore >
నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"
Posted On 2026-08-27 07:58:21
Readmore >
గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!
Posted On 2026-08-27 05:16:28
Readmore >
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >