| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో పాత బస్సు స్టాండ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం లో సుమారు 18 దుకాణాలు అగ్నికి అహుతి అయినా సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రమాద స్థాలిని పరిశీలించి అగ్ని ప్రమాదంలో ఆస్థి కోల్పోయిన వ్యాపారులను ఆదుకోవడానికి తక్షణ సహాయంగా ఆర్ధిక సహాయం చేసారు. బాధితులను ప్రభుత్వం ద్వారా తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్,  మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, కౌన్సిలర్లు షేరు, అన్వార్, వాజీద్, సిద్దిక్, గంప ప్రసాద్, RDO, MRO, మున్సిపాల్ కమీషనర్, అధికారులు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Previous పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త
Next గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు
ADVERTISEMENT