Posted on 2025-11-12 19:12:07
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పిలుపు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా నియామకమైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నుండి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు బుధవారం కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మంత్రి పదవిలో ఉన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లాను అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకువెళ్లారని, జిల్లాకు మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కి ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. అలాంటి గొప్ప మనసున్న నేతకు రాష్ట్రప్రభుత్వం తమ మంత్రివర్గ క్యాబినెట్లో ముఖ్య సలహాదారులుగా నియామకం అయినందున ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకుడికి మంత్రి హోదా ఇవ్వడం సంతోషకర విషయం అని అన్నారు.
ముఖ్య సలహాదారులుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియమితులైన తర్వాత సుదర్శన్ రెడ్డిజిల్లాకు మొట్టమొదటిసారిగా రాబోతున్న సందర్భంగా ఆయనకు జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలకడం జరుగుతుందన్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు మాధవ్ నగర్ సాయి బాబా ఆలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.
అక్కడి నుండి పాత కలెక్టర్ గ్రౌండ్ చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శ్రీనివాస్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >