| Daily భారత్
Logo




కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం

News

Posted on 2026-03-11 15:53:40

Share: Share


కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని దేశ రాజధాని ఢిల్లీలో కలిసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కై ABSS (అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్) (extention) విస్తరణ కింద ఓరియంటల్ పాఠశాల నుండి దర్శన్ థియేటర్ ముందు వరకు అభివృద్ధి చేయాలని దాని కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రి కి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. 

అలాగే పాత రైల్వే క్వార్టర్ లను తొలగించి కొత్తగా వివేకానంద కాలనీ వైపు నిర్మించాలని, అలాగే స్టేషన్ రోడ్ వైపు ఉన్న రైల్వే భవనాలు వివేకానంద కాలనీ వైపు నిర్మించాలని అలాగే  నూతన రైల్వే భవనం మరియు  ఫుట్ ఓవర్ బ్రిడ్జి కి సంబందించిన ప్లాన్స్ పూర్తి అయ్యాయని మంత్రి నుండి సానుకూల స్పందన వచ్చిందని వాటి నిర్మాణానికి ప్లాన్స్ పూర్తి చేసి ప్లాన్స్ డిపార్ట్మెంట్ నుండి కనస్ట్రక్షన్ డిపార్ట్మెంట్ పంపారని త్వరలోనే నిధులు కేటాఇస్తూ అనుమతులు కూడా ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి స్వయంగా తెలిపారు

అంతే కాకుండా జిల్లా కేంద్రంలో మూడు చోట్ల ROB రోడ్ ఓవర్ బ్రిడ్జి ల ఏర్పాటు చేయాలని గతంలో చేసిన వినతులకు స్థల పరిశీలన, జాయింట్ ఇన్స్పెక్షన్ సాయిల్ టెస్టింగ్ అన్ని త్వరలో పూర్తి చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు 

అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభమై రెండు సంవత్సరాల లోపు పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. ఈ విషయంలో తనకు పూర్తిగా సహకారం అందిస్తున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయంలో సహకరించిన మాజీ కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కి శాసన సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >