Posted on 2026-03-11 15:57:35
తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ భిక్నూర్‌లో ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం
ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు
కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి: విశ్వవిద్యాలయ ప్రాంగణం కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రం కాదు, అది ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, సమాజానికి ఒక గొప్ప నాయకుడిని అందించే అద్భుతమైన వేదిక. ఇక్కడ వికసించే ఆలోచనలు మీ భవిష్యత్తును మహోన్నతంగా నిర్మించేలా ఉండాలి తప్ప, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలను చీకట్లోకి నెట్టేయకూడదు" అని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆకాంక్షించారు. ఈరోజు భిక్నూర్‌లోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం మరియు క్రమశిక్షణపై నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి సమావేశంలో కామారెడ్డి ఏఎస్పి బి చైతన్య రెడ్డి పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు
ఈ సందర్భంగా ASP చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. కళాశాలలో ఏర్పడే స్నేహాలు జీవితాంతం నిలిచిపోయే తీపి జ్ఞాపకాలని, అటువంటి పవిత్రమైన బంధాలను గౌరవించుకోవాలని సూచించారు. సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లకు అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెళ్లలా అండగా నిలబడి మార్గదర్శకులుగా మారాలని కోరారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చి తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను వమ్ము చేయవద్దని ఆమె విద్యార్థులను సున్నితంగా హెచ్చరించారు.
ఈ సందర్భంగా భిక్నూర్ CI సంపత్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ విద్యార్థి జీవితం ఎంతో అందమైన దశ అని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో కష్టపడుతూ వారిని చదివిస్తారని పేర్కొన్నారు. అలాంటి జీవితాన్ని అనవసరమైన విషయాల వల్ల ఇబ్బందుల్లో పడేయకూడదని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే విధంగా విద్యార్థులు తమ ప్రవర్తనను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
అలాగే భిక్నూర్ SI ఆంజనేయులు ర్యాగింగ్ వల్ల కలిగే పరిణామాలు, చట్టపరమైన శిక్షలు మరియు దాని ప్రభావాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశలో పోలీస్ కేసులు నమోదైతే భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్, వివిధ విభాగాల అధ్యాపకులు, సీనియర్ మరియు జూనియర్ విద్యార్థులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >