| Daily భారత్
Logo




అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్

News

Posted on 2026-03-11 14:18:15

Share: Share


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్

మహిళలు ప్రతిరంగంలో ముందుండాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

డైలీ భారత్, కామారెడ్డిజిల్లా వయోవృద్ధుల, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారిత కేంద్రం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు స్వతంత్రంగా అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమాజంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పురుషులతో సమానంగా మహిళలు విద్య, ఉద్యోగం, ఉపాధి, క్రీడలు తదితర అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, దేశ స్థాయిలో విద్య, ఉద్యోగం, ఉపాధి, క్రీడా రంగాల్లో, స్వచ్ఛంద సంస్థల కు చెందిన ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు.  ఐడీఓసీలోని వివిధ విభాగాలకు చెందిన మహిళల కోసం ఆటలు, పాటలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మొత్తం 150 మంది మహిళలను జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శాలువాలు, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. సోనియా శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  పేద మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం వర్క్ లో శిక్షణ ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యమై పెద మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చిన సోనియా శంకరును అభినందించారు. ఆమెను శాలువాతో సన్మానించి జ్ఞాపకను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బిచ్కుంద మున్సిపల్ చైర్‌పర్సన్ సీమా సెట్‌కార్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు, అడిషనల్ డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీపీఆర్‌ఓ తిరుమల, సీడబ్ల్యూసీ సభ్యురాలు స్వర్ణలత, జిల్లా మహిళా సాధికారత కేంద్ర సిబ్బంది శారద, తులసి, సౌందర్య, అరుణ్ కుమార్, బాల రక్షాభవన్ అధికారి స్రవంతి, చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్ సిబ్బంది, సఖి కేంద్రం సిబ్బంది కవిత తదితరులు పాల్గొన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >