కామారెడ్డి (డైలీ భారత్): తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర పిలుపు మేరకు ముదిరాజ్ ల సమస్యలపై కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గురు నరసింహులు ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ముదిరాజ్ సోదరులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, జీవో 6ను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో అమలు తర్వాత ప్రతి గ్రామంలో ముదిరాజ్ లకు 3 ఎకరాల భూమి, పండ్లు-పలారాల సాగుకు అవకాశం కల్పించాలని కోరారు.
చెరువులు, కుంటల మరమ్మతులు, రిజిస్ట్రేషన్లు చేయాలని, చాలా గ్రామాల్లో కుంటలు ఉన్నా బెస్తవారు ఉండటం వల్ల ముదిరాజ్ లకు సభ్యత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కరున్నా కుంటలో చాప పిల్లలను మత్స్య శాఖ వారికే అమ్మి వారు జీవనం సాగిస్తున్నారని, ముదిరాజ్ లు చెరువుల్లో చాప పిల్లలు పోద్దామంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుందని భయాందోళన చెందుతున్నారని తెలిపారు.
ఎక్కడైతే కుంటలు, చెరువులు ఉంటాయో అక్కడ ముదిరాజ్ సోదరులు ధైర్యంగా చేపల పెంపకం చేపట్టేలా ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.