డైలీ భారత్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని స్థానిక హైదరాబాద్ రోడ్ లో గల యశోద ఓపి సెంటర్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకే ఆధునిక చికిత్సలు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ద్వారా నిర్వహిస్తున్నామని యశోద హాస్పిటల్ అంకాలజిస్ట్ డాక్టర్ భరత్ వాష్వాణి అన్నారు. క్లిష్టమైన కేసులను వివిధ విభాగాల నిపుణులైన వైద్యులు కలిసి చర్చించి,ఉత్తమ చికిత్సను నిర్ణయిస్తా రని పేర్కొన్నారు. కీమోథెరపీ,టార్గెటెడ్ థెరపీ,ఇమ్యూనోథెరపీ, CAR-T సెల్ థెరపీ వంటి అనేక చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆధునిక సాంకేతికత, నిపుణులై న వైద్యు ల సహకారంతో ప్రతి క్యాన్సర్ రోగికి సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హాస్పిటల్స్ కార్పొరేట్ రిలేషన్స్ సికింద్రాబాద్ మేనేజర్ శ్రీరమ్ సురేష్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
News
యశోద హాస్పిటల్‌లో క్యాన్సర్ రోగుల అవసరా లకు అనుగుణంగా ప్రత్యేకమైన,సమగ్ర క్యాన్సర్ చికిత్స