| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొత్తగూడెం : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రారంభం... జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఉచిత రిజిస్ట్రేషన్

కొత్తగూడెం : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రారంభం... జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఉచిత రిజిస్ట్రేషన్

భద్రాద్రి కొత్తగూడెం (డైలీ భారత్): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోవాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు.

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి సూచనల మేరకు శనివారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను ప్రారంభించారు.

అర్హత: నవంబర్ 1, 2023 నాటికి ఏదైనా డిగ్రీ లేదా డిప్లమా పూర్తి చేసిన వారు అర్హులు.

బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఉచిత ఓటర్ రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు సంకుబాపన అనుదీప్, వేముల ప్రసాద్ బాబు, కరాటే శ్రీను, కన్ని, అన్వర్, పూర్ణ, మనోజ్, ఈమంది గణేష్, శివ, మదాసు పద్మ, షరీఫ్, అంబుల వేణు గోపాల్, జున్నరు రాజేష్ గౌడ్, షణ్ముఖ, సోహెబ్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.

Previous చిట్టీల పేరుతో రూ.6.24 కోట్ల మోసం... ప్రభుత్వ టీచర్, భార్య అరెస్ట్
Next యశోద హాస్పిటల్‌లో క్యాన్సర్ రోగుల అవసరా లకు అనుగుణంగా ప్రత్యేకమైన,సమగ్ర క్యాన్సర్ చికిత్స
ADVERTISEMENT