Posted on 2026-03-11 14:09:30
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు?
డైలీ భారత్, కేశంపేట: కేశంపేట మండల పరిధిలోని పోల్కోనిగుట్ట తండా గ్రామపంచాయతీలో సర్వే నంబర్ 32 లో మట్టి రవాణా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. పట్టపగలే యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారీ యంత్రాలతో తవ్వకాలు
గత కొన్ని రోజులుగా పోల్కోనిగుట్ట తండా పరిసరాల్లో రెండు పెద్ద ఇటాచి (Hitachi) యంత్రాలతో భూమిని తవ్వుతూ, పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వాహనాలు నిరంతరం మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం.
అధికారులు ఏం చేస్తున్నారు?
"మా కళ్ల ముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?" అని గ్రామస్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతోందా? లేక వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామస్తుల ఆవేదన:
"భారీ వాహనాల రాకపోకలతో రహదారులు ధ్వంసమవడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి."
తక్షణ చర్యలు అవసరం
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >