Posted on 2025-11-12 19:09:07
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఇక జైలుకే
అడ్మినిస్ట్రేటివ్ డిసిపి బస్వా రెడ్డి
డైలీ భారత్, నిజామాబాద్: రోడ్లపై అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రాంతంలో నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో బుధవారం శబ్ద బుధవారం కాలుష్యానికి కారణమవుతున్న బైక్ల సైలెన్సర్లను తొలగించి రైలేస్టేషన్ ప్రాంతంలో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ డిసిపి బసవ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో రోడ్లపై అధిక శబ్దాలను చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను తీసివేసి రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేసినట్లు ఆయన అన్నారు. ఇకపై తమ ద్విచక వాహనాలకు వాహనదారులు అధిక శబ్దం వచ్చేలా సైలెన్సర్లను బిగిస్తే కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడితే ఇకపై జైలుకే పంపడం జరుగుతుందని దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని ఆయన అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా ఎదురుగా సురక్షితంగా వచ్చేవారు కూడా ఇబ్బందుల పాలవుతారని అందుకే సిపి ఆదేశాల మేరకు ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పానీయాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. ఒక్కసారి ఈ కేసులలో ఇరికితే జీవితాంతం కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అందుకే వీటి వలలో ఎవరూ పడకూడదు అని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మహమ్మద్ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >