డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పెనపహాడ్ పోలీస్ స్టేషన్ నందు పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ యాదగిరి ఇటీవల ఆకాలంగా మరణించడం జరిగినది. దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాల అవసరాలు తీర్చడం లో భాగంగా పోలీసు చేయూత పథకం ద్వారా యాదగిరి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల పోలీసు చేయూత పథకం చెక్కును ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది. యాదగిరి కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపినారు. చేయూత పథకం నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బంది ప్రతి నెల జీతం నుండి విరాళం అందిస్తున్నారు అని అభినందించారు, పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు అన్నారు.
ఈ కార్యక్రమం నందు వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.