| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

 మొక్కజొన్నలు  పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో గోడు వెళ్లబోసుకున్న కేషన్నపల్లి రైతులు

కేసీఆర్ పుణ్యానా సాగునీళ్లు వచ్చి ఏడాదికి మూడు పంటలు తీస్తున్నాం

మొక్కజొన్నలు ప్రభుత్వం ఎకరానికి 26 క్వింటాల్లే కొనడంతో మిగతావి దళారులకు అడ్డికి పావుసేరు అమ్ముకుంటున్నామని ఆవేదన

కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు మొక్కజొన్నలు కొనాలని రసమయి బాలకిషన్

ప్రభుత్వం పూటకో మాట చెప్పుతూ రైతులను ఇబ్బందులు పెడుతుందని మండిపాటు

డైలీ భారత్, ఇల్లంతకుంట: మా  నల్లరేగడి భూముల్లో చినుకు చుక్క పడితేనే పత్తి సాగు చేసుకునేటోళ్లం...కానీ గత ఐదారేళ్ల సంది కేసీఆర్ పుణ్యమా అని అనంతగిరి డ్యాం కట్టి కాల్వలు నిర్మాణం చేసి సాగు నీళ్లు ఇవ్వడంతో వర్షాకాలంలో పత్తి... యాసంగిలో  పొద్దుతిరుగుడు,మొక్కజొన్న సాగు చేస్తూ ఏడాదికి మూడు  పంటలు పండిస్తున్నామని పేర్కొన్నారు

ఇల్లంతకుంట మండలంలోని కేషన్నపల్లి గ్రామ రైతులు మానకొండూర్ మాజీ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ తో అన్నారు.

ఇల్లంతకుంట నుంచి బెజ్జంకి వైపు వెళ్తున్న క్రమంలో కేషన్నపల్లి వద్ద మొక్కజొన్న కంకులు ఏరుతున్న రైతులను చూసి వాహనం నిలిపి  రైతు ప్రభాకర్ వ్యవసాయక్షేత్రంలోకి వెళ్లి పలకరించారు.

ఈ సందర్భంగా రైతులు రసమయి బాలకిషన్ తో ఇలా గోడు వెళ్లబోసుకున్నారు... సారూ మొక్కనోన్నలు పండించి ..అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం ప్రభుత్వం ఎకరాకు 26 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే కొనుగోలు చేయడంతో మిగతావి దళారులకు అడ్డికి పావుసేరు అమ్ముకుని నష్టపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ సందర్భంగా మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాదని రైతులను పీక్కుతినే ప్రభుత్వమని ప్రభుత్వం బేశారతుగా ఎకరాకు 35 క్వింటాళ్ల చొప్పున మొక్కజొన్నలు కొనుగోలు  చేయాలని డిమాండ్ చేశారు రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే సర్కారు పూటకో నిబంధన పెడుతూ రైతులను నట్టేట ముంచుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పండించిన మొక్కజొన్నలు కొనుగోలు చేయాలన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని... రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారని పేర్కొన్నారు.

Previous ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Next పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
ADVERTISEMENT