| Daily భారత్
Logo




JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం

News

Posted on 2025-11-12 08:50:16

Share: Share


JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం

కృషికి ప్రతీకగా మరో మైలురాయి

డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని అగ్ర సాంకేతిక విద్యాసంస్థ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTUH) నుండి  ఎనర్జీ సిస్టమ్స్ విభాగంలో డాక్టరేట్ డిగ్రీను మంద రంజిత్ కుమార్  2025 నవంబర్ 11న పొందడం గర్వకారణం.

Design and Analysis of SPV Systems for Higher Electrical Output with Different MPPT Techniques" అనే అంశంపై ఆయన విలువైన పరిశోధన చేశారు.ఈ పరిశోధనను విశ్వవిద్యాలయ రెక్టర్ డా. కె. విజయ కుమార్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు  మండలంలోని ప్రభుత్వ పాఠశాల (ZPHS) లో ప్రాథమిక విద్యనభ్యసించి, 10వ తరగతిలో మండలంలో రెండవ ర్యాంక్ సాధించారు.తరువాత కొత్తగూడెం నలందా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు 920 మార్కులు సాధించి, ఎంసెట్ ద్వారా పాల్వంచాలోని ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈఈఈ(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) శాఖలో బి.టెక్ సీటు పొందారు.బి.టెక్ సమయంలోనే ఆల్ ఇండియా గేట్ పరీక్షలో అద్భుత ర్యాంక్ సాధించి, జేఎన్‌టీయూహెచ్ విశ్వవిద్యాలయంలో ఎం.టెక్ సీటు పొందారు.ఎం.టెక్‌ను జేఎన్‌టీయూహ్‌లో విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం, మళ్లీ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్ ఆధారంగా జేఎన్‌టీయూహ్‌లోనే పీహెచ్.డి ప్రవేశం పొందడం ఆయన విద్యా ప్రయాణంలో మరో గొప్ప ఘట్టంగా నిలిచింది.విద్యార్థి జీవితంలో ఆయన కేవలం విద్యార్థిగా మాత్రమే కాకుండా విద్యార్థి నాయకుడిగా ఎదిగి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగానిలిచారు. విశ్వవిద్యాలయంలోని టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది, విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ, జేఎన్‌టీయూహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా విలువైన సేవలు అందించారు.తదుపరి, ఆయన జేఎన్‌టీయూహెచ్ జేఏసీ చైర్మన్ పదవికి కూడా నియమితులయ్యారు.విద్యార్థి ఉద్యమాలతో పాటు తన పరిశోధనలో కూడా పట్టుదలతో కొనసాగి, నేడు డాక్టరేట్ డిగ్రీ సాధించడం ఆయన కృషి, క్రమశిక్షణ, అంకితభావానికి ప్రతీకఅంతేకాకుండా మంద రంజిత్ కుమార్  ఒకే కమ్యూనిటీతో కాకుండా అన్ని కమ్యూనిటీలతోనూ మంచినడవడి, పరస్పర గౌరవభావం కొనసాగిస్తూ,తన పుట్టిన కమ్యూనిటీకి న్యాయం జరిగేలా అనేక పోరాటాలు చేశారుసమాజంలోని అన్ని వర్గాలతో సమానమైన సంబంధాలు కొనసాగిస్తూ, ఐక్యత, సామాజిక సమానత్వం కోసం తనదైన రీతిలో కృషి చేస్తున్నారు.తన విద్యా ప్రయాణం మాత్రమే కాదు, సమాజం పట్ల కూడా ఆయనకు ఉన్న నిబద్ధత ప్రశంసనీయం.తన మాల కమ్యూనిటీ అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, సమాజ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు.జెఎన్టిహెచ్ జేఏసీ కమిటీ మరియు మాల మహానాడు రాష్ట్ర కమిటీ తరఫునమంద రంజిత్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ,భవిష్యత్తులోఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలనుఅధిరోహించాలని కోరుకుంటున్నాముమాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య , రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు మరియు ఎం.ఆర్‌.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >
Image 1

ఘనంగా సామాజిక సమరసత దివాస్

Posted On 2025-12-06 15:48:27

Readmore >
Image 1

అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన

Posted On 2025-12-06 15:47:25

Readmore >
Image 1

చండ్రుగొండ మండలంలో 280 క్వింటాలరేషన్ బియ్యం పట్టివేత

Posted On 2025-12-06 15:34:05

Readmore >
Image 1

ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త

Posted On 2025-12-06 15:33:03

Readmore >
Image 1

సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి

Posted On 2025-12-06 15:32:07

Readmore >
Image 1

అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం

Posted On 2025-12-06 15:30:17

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2025-12-06 08:57:18

Readmore >