జిల్లాలో మాధకద్రవ్యాల నియంత్రణ, వాటి వలన కలిగే అనర్ధాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా నిర్వహిస్తున్న డ్రగ్ అవర్నెస్ వీక్ లో భాగంగా ఈరోజు జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరి ఆరోగ్యకర జీవితానికి No Smoking, No drinking, No Drugs for a Healthy Life. స్మోకింగ్ వొద్దు, మద్యపానం వద్దు, మాదక ద్రవ్యాలు వద్దు.* అనే నినాదంతో విద్యార్థులకు,యువతకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈసందర్భంగా ఎస్పి మాట్లాడుతూ...జిల్లాలో మాదకద్రవ్యాల వలన అనర్ధాలపై పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు,యువతకు,ప్రజలకు ,విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.
I AM ANTI DRUG SOLDIER” అనే పోస్టర్ పై ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి అందరూ I AM ANTI DRUG SOLDIER గా నమోదు చేసుకొని మాధకద్రవ్యాల నిర్ములనలో భాగస్వామ్యం కావాలి..